దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అని అనుకుంటున్నారా ?ప్రస్తుతం అమెరికా లో తన కలానికి పని చెబుతూ అక్కడ మహేష్ సినిమా ఆగడు కథను రాసుకుంటున్నాడట. ఇటీవలే శ్రీను వైట్ల తన భార్యతో కలిసి అమెరికా వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు సరదాగా గడిపారు. ఆ తర్వాత మాత్రం వైట్ల సీరియస్ గా ఆగడు కథఫై దృష్టి పెట్టారట. సన్నివేశాల్ని కొత్తగా రాసుకుంటున్నారట.
"బాద్ షా" తర్వాత ఆయన తీస్తున్న సినిమా ఇదే కావడంతో కథపై మరింతగా దృష్టి పెట్టారు అని టాక్. "దూకుడు" తరువాత మళ్ళి మహేష్ శ్రీను వైట్ల ల ప్రాజెక్ట్ కావడం తో అబిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా "ఆగడు" కథను సిద్దం చేసుకుంటున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్ .ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే. శ్రీను వైట్ల ఒకప్పటి అస్థాన రచయిత, నేటి బద్ద శత్రువు అయిన కోన వెంకట్ కూడా ఇప్పుడు అమెరికాలోనే తన సినిమా కోసం కథ రాసుకుంటున్నాడట.
ఈ కథ బాగా వస్తే మాత్రం కోన వెంకట్ పవర్ స్టార్ పవన్ ను కలిసి తనకు అవకాశం ఇవ్వమని అడిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు . మరి ఈ ఇద్దరూ పోటాపోటీగా రాసుకుంటున్న ఈ కథలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి.అంతేకాదు ప్రస్తుతం బద్దశత్రువులు గా ఉన్న వీరిద్దరూ ఎవరికీ తేలియకుండా అమెరికాలో కలుసుకుని ఒకరి స్క్రిప్ట్ కు మరొకరు టచింగ్ఇచ్చుకుని అందరిని ఆశ్చర్య పరిచినా చేయకలిగింది లేదు .సినిమా వాళ్ళకు , రాజకీయ వాదులకు శాశ్వత శత్రువులు – మిత్రులు ఉండరుగా !!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి