నందమూరి సింహం బాలకృష్ణ భోళాశంకరుడు అని అతడి సన్నిహితులు తరుచు చేసే కామెంట్స్ ఆ మాటలు మొన్న విశాఖపట్నంలో జరిగిన టి.ఎస్.ఆర్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో మళ్ళీ నిజం అయ్యాయి. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి తరానికొక్క నటుడు వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
ఆయన వారసత్వంతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి నటులు వెండితెర పై ఒక వెలుగువెలుగుతున్న నేపధ్యంలో అదే కుటుంబానికి చెందిన మరో తరానికి తెర లేచింది. రాబోయే కాలంలో మరింత మంది ఎన్టీఆర్ వారసులు వెండితెర పై తమ టాలెంటు నిరూపించుకోవడానికి ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారు.
అలాంటి వారిలో ఒకడిగా సీనియర్ ఎన్టీఆర్‌కు మునిమనవడు, హరికృష్ణకు మనవడు, దివంగత జానకిరామ్ తనయుడైన మాస్టర్ ఎన్టీఆర్ టి.ఎస్.ఆర్ అవార్డ్స్ నైట్ లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకోవడానికి ముందు మాస్టర్ ఎన్టీఆర్ బాలయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ఆ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది.
ఈ నందమూరి వారసుడు చిన్న కుర్రాడే అయినా ఎనలేని వినయవిధేయతలు ప్రదర్శిస్తు బాలకృష్ణ పాదాలకు నమస్కరించడం అ కార్యక్రమంలో పాల్గొన్న వారిందరి దృష్టీ ఆకర్షించడమే కాకుండా బాలకృష్ణ మనసును కరిగించి వేసింది. మాస్టర్ ఎన్టీఆర్ కు అవార్డు ఇస్తున్న సమయంలో బాలయ్య ముఖంలో కూడా ఎంతో సంతోషం కనిపించింది. మాస్టర్ ఎన్టీఆర్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘దానవీర శూరకర్ణ' లో మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో మాస్టర్ ఎన్టీర్ కృష్ణుడుగా చేసిన నటనకు విమర్శకుల ప్రసంసలు లభించాయి. అంతేకాదు కృష్ణుడు పాత్ర నటింప దగ్గ సాహసం ఒక్క నందమూరి కుటుంబం తప్ప మరి ఏ కుటుంబం చేయలేదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఏది ఎలా ఉన్ననా టి.ఎస్.ఆర్ అవార్డ్స్ నైట్ లో బాలయ్య కాళ్లకు మాస్టర్ ఎన్టీఆర్ నమస్కరించిన బ్యూటిఫుల్ మూమెంట్ ఆ ఈవెంట్ కు హైలైట్ గా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి