తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రావు గోపాల రావు సతీమణి, నటుడు రావు రమేశ్ తల్లి కమలా కుమారి (73) శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కమలాకుమారి వయసు 75 సంవత్సరాలు. కమలకుమారి గొప్ప హరికథా కళాకారిణి. తాజాగా  చిరంజీవి రావు రమేశ్ కుటుంబాన్ని పరామర్శించిన  సంతాపం తెలిపారు.   
Chiranjeevi condoles rao ramesh family
స్టేజ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఓ నాటకం ద్వారా రావు గోపాలరావుకు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా, వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రావు రమేశ్ పెద్ద కుమారుడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..కమలకుమారి మరణవార్త వినగానే చాలా ఆవేదన చెందానని..ఆమె గొప్ప కళాకారిని అన్నారు. 
రావు రమేష్ నివాసానికి చిరంజీవి
ఎన్నో స్టేష్ షోల్లో నటించి మెప్పించారని చిరంజీవి అన్నారు.  కమలకుమారి పార్ధీవదేహాం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి చిరంజీవి శ్రద్ధాంజలి ఘటించారు.తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న రావురమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని ఆయన నింపారు. రావు గోపాలరావు దంపతులతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.
చిరంజీవి ఓదార్పు
రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి, రావు గోపాల రావు కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది.  చిరంజీవి మామ అల్లు రామలింగయ్యకు, రావు గోపాలరావుకు ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన  చిత్రాల్లో నటించారు. రావు గోపాలరావుకు గొప్ప విలన్‌గానే కాకుండా విలక్షణ నటుడు అనే ఖ్యాతి ఉంది. చిరంజీవి నటించిన పలు చిత్రాల్లో రావు గోపాలరావు ప్రతినాయకుడి పాత్రను పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: