కొద్దిరోజులుగా సోషల్ మీడియా ఇంకా టివి ఛానెల్స్ వేదికగా కాస్టింగ్ కౌచ్ గురించి బండ బూతులు మాట్లాడుతూ హల్ చల్ చేస్తున్న శ్రీరెడ్డి మొన్న ఫిల్మ్ చాంబర్ ఎదుట చేసిన అర్ధ నగ్న ప్రదర్శన తెలిసిందే. ఆ తర్వాత మా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం ఆమెకు మెంబర్ షిప్ ఇవ్వడం కాదు ఆమెతో నటిస్తే మిగతా వారిని కూడా సస్పెన్స్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారు.


అయినా సరే తన మాటల తూటాలని ఆపేయని శ్రీరెడ్డి ఇన్నాళ్లు ప్రముఖ నిర్మాత తనయుడు తనని వాడుకున్నాడని చెప్పుకుంటూ రాగా ఇప్పుడు అతనెవరో కాదు సురేష్ బాబు తనయుడు అంటూ లీక్ చేసింది. బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ బాబుని అతని తనయుళ్లను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి.


ఆమె వ్యవహారం చూస్తుంటే ఎక్కడివరకైనా వెళ్లేట్టు కనిపిస్తుంది. నిర్మాత కొడుకు తనని అనుభవించి అవకాశాలు ఇవ్వకుండా చేశాడంటూ ఎలాంటి భయాందోళనలు లేకుండా చెప్పేస్తుంది శ్రీరెడ్డి. అయితే 'మా' ఆమె మీద సీరియస్ గా ఉన్నా అవేవి పట్టించుకోకుండా సినిమా వళ్ల మీద ఇంకా ఫైర్ అవుతుంది శ్రీరెడ్డి.  


ఆమె అడిగినట్టు అవకాశాలు ఇచ్చినా సరే ఆమె మాత్రం ఇంకా ఈ లీకుల హంగామా చేస్తూనే ఉంది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వేశాలు వేస్తుందని కూడా అంటున్న వారు ఉన్నారు. కచ్చితంగా శ్రీరెడ్డి విషయంపై సదరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: