జీవితా రాజశేఖర్ ల చిన్న కూతురు శివాత్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో నటిస్తున్న ‘దొరసాని’ మూవీ జూలైలో విడుదల కాబోతోంది. 1980 నాటి తెలంగాణా వాతావరణంలో అల్లబడ్డ ఈమూవీలో ‘దొరసాని’ పాత్రలో శివాత్మిక నటిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ ప్రమోషన్ ను చాల ముందుగానే మొదలు పెట్టేసారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఎఫ్ ఎమ్ రేడియో కార్యక్రమానికి శివాత్మిక ఆనంద్ దేవరకొండతో కలిసి వచ్చి ఈమూవీకి సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసింది. 

వాస్తవానికి తాను నటనలో శిక్షణ తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో తనకు అనుకోకుండా ఈసినిమాలో నటించే అవకాశం వచ్చిన విషయాన్ని తెలియ చేసింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రేడియో జాకీ ‘’కిల్ మ్యారీ హుక్ అప్’ అనే మూడు అంశాల విషయంలో ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ మహేష్ బాబులలో ఎవర్ని దేనికి ఎంచుకుంటావు అన్న ప్రశ్నకు శివాత్మిక షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. 

‘విజయ్ దేవరకొండను చంపి ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుని మహేష్ బాబుతో హుక్ అప్ ప్రిపేరు అవుతాను’ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చింది. ఇదే సందర్భంలో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను నటిని కాకుండా ఉంటే మెడిసెన్ చదివి ఉండేదానిని అంటూ తమ కుటుంబం అంతా డాక్టర్ల ఫ్యామిలీ కావడంతో తన ఆలోచనలు అన్నీ మెడిసెన్ వైపే ఉండేవి అంటూ కామెంట్స్ చేసింది. డాక్టర్ కాబోయి హీరోయిన్ అయ్యాను అంటూ గతంలో జయప్రద లాంటి చాలామంది మాజీ హీరోయిన్స్ చెప్పిన మాటలను మళ్ళీ శివాత్మిక రిపీట్ చేయడం మామూలు విషయమే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: