మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఈ ఇయర్ ఆల్రెడీ ఎఫ్-2 తో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేశాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వచ్చింది.
గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ కిరణ్ డైరక్షన్ లో ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. జెర్సీ తరహాలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం ఆల్రెడీ వరుణ్ తేజ్ వర్క్ అవుట్స్ స్టార్ట్ చేశాడట. ఇక మరోపక్క ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తాడట వరుణ్ తేజ్.
ఆల్రెడీ వెంకీ అట్లూరి డైరక్షన్ లో తొలిప్రేమతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కథల సెలక్షన్స్ తో మిగతా హీరోలకే కాదు మెగా హీరోలకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాడు. ముకుంద నుండి ఎఫ్ 2 వరకు సాఫ్ట్ పాత్రల్లో లవర్ బోయ్ ఇమేజ్ తో కనిపించిన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు.
గద్దలకొండ గణేష్ తో వరుణ్ తేజ్ మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. కేవలం ఒక జానర్ సినిమాలకే పరిమితం కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు వరుణ్ తేజ్. మెగా హీరోల్లో ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్న వరుణ్ తేజ్ చూస్తుంటే త్వరలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. వెంకీ అట్లూరి ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాని వరుణ్ తేజ్ తో సినిమా ఉండొచ్చని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి