పుట్టపర్తి సత్యసాయిగా బాబా జీవిత కధ ఆధారంగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో పుట్టపర్తి సత్యబాబ అనే సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. అయితే టైటిల్ పాత్రదారి కోసం గత కొంత కాలంగా షూటింగ్ ఆపేసిన కోడిరామకృష్ణకు ఎట్టకేలకు ఆ పాత్రని పోషించే నటుడు లభించాడు. ఆ నటుడు మరెవరో కాదు. మళయాళ సుపర్ స్టార్ మమ్ముట్టీని దర్శకుడు కోడిరామకృష్ణ సంప్రదించాడని ప్రచారం జరిగింది. అయితె చివరికి సత్యసాయి పాత్రలో నటించగడానికి దిలీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇప్పటి వరుకు సత్యసాయి చిన్నప్పటి దృశ్యాల చిత్రీకరణని కోడిరామకృష్ణ పూర్తి చేశాడట. ఇప్పటి వరుకు జరిగిన షూటింగ్ తో యాభైశాతం సినిమా పూర్తయింది, ఇకపై సత్యసాయి బాబాగా మరినక్రమాన్ని షూట్ చేయబోతున్నారట. బాబా తల్లిగా జయప్రద, తండ్రిగా శరత్ బాబు నటిస్తుండగా ఈ భక్తిరసాత్మక సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సౌభాగ్య చిత్ర సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: