సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఘట్టమనేని ఫ్యాన్స్ ను అలరిస్తుంది. 2020 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి రీసెంట్ గా బయటకు వచ్చిన క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.


అదేంటి అంటే మహేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికతో ఘాటు అదరచుంబనం చేశాడట. అదేంటి మహేష్ అలాంటి వాటికి దూరంగా ఉంటాడు కదా అనుకోవచ్చు. ప్రస్తుతం యూత్ అంతా సినిమాలో కావాల్సిన మసాలా ఆశిస్తున్నారు. వారిని సాటిస్ఫై చేయాలంటే ఇలాంటివి పెట్టక తప్పదు. 


అయితే అదేదో ఇరికించినట్టు కాకుండా దానికో సందర్భం ఉండేలా చేశారట. ఇక తెలుగులో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న రష్మిక ఏదైనా సినిమా చేస్తుంది అంటే అందులో తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో విజయ్ తో లిప్ లాక్ చేసింది రష్మిక. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మహేష్ రష్మికల మధ్య లిప్ లాక్ సీన్ ఉందట.


ఈ విషయాన్ని చిత్రయూనిట్ బయటకు రానివ్వడం లేదు. సినిమాలో విజయశాంతి కూడా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతికి బన్ని అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాతో పాటుగా మహేష్ సరిలేరు నీకెవ్వరు వస్తుంది. సినిమాలో రష్మిక హీరోయిన్ అవడం కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: