టాకీ యుగం వచ్చాక మూకీ సినిమా తీయాలన్న ఆలోచనతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా ‘పుష్పకవిమానం’. కమల్ హాసన్, అమల కీలక పాత్రధారులు. 1987లో వీఆర్ నాగరాజుతో కలిసి తెరకెక్కించారు సింగీతం.  ఈజీ మనీ కోసం ఆలోచిస్తాడు కమల్ హాసన్. అదే నెపంతో స్టార్ హోటల్ ముందు మందు ఎక్కువై పడిపోయిన ఓ గొప్పింటి వ్యక్తిని కిడ్నాప్ చేస్తాడు. అతని పేరిట స్టార్ హోటల్ లో బస చేస్తాడు. పనిలో పనిగా గొప్పింటి అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు.  ఈ క్రమంలోనే జీవితానికి సంబంధించిన కఠోర సత్యాలను తెలుసుకుంటాడు. ఉద్యోగం కోసం కాలయాపన చేయకుండా స్వశక్తని నమ్ముకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎవరైనా చూడదగ్గ కథ ఇది. మనసు భాషతో తెరకెక్కిన కథ. ఇవాళ్టికి ఈ సినిమా వచ్చి పాతికేళ్ళయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: