పూనమ్ కౌర్ ఏదైనా ట్విట్ చేసిందంటే చాలు ఆ ట్విట్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు చాల హడావిడి చేస్తుంటారు. అయితే పూనమ్ మాత్రం డైరెక్ట్ గా పవన్ పేరు ప్రస్తావించకుండా ఒక పజిల్ లా అనేక అర్ధాలు వచ్చేలా పూనమ్ తాను చేసే ట్విట్స్ లో భాషను వాడుతూ ఉంటుంది. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెచ్చిపోతూ జగన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో మళ్ళీ రంగంలోకి దిగిన పూనమ్ లేటెస్ట్ గా చేసిన ట్విట్ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా పూనమ్ ప్రస్తావిస్తున్న ‘సినీ అలియాస్ రాజకీయ నేత’ ఎవరు అన్న విషయమై ప్రస్తుతం మళ్ళీ హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. 

‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు థ్యాంక్స్. అలాగే నాతో పాటు మరికొందరు మహిళలను మోసం చేసిన సినీ అలియాస్  రాజకీయ నేతలను శిక్షిస్తారని భావిస్తున్నాను.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్విట్ కొద్దిసేపు మాత్రమే ఉంచి ఆ తరువాత ఆ ట్విట్ ను తొలగించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో పూనమ్ ఇలాంటి పదాలను వాడుతూ ఎందుకు ట్విట్ చేసింది. చేసిన ట్విట్ ను ఎందుకు తొలగించింది అంటూ కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరైతే ఈ ట్విట్ పూనమ్ కౌర్ చేయలేదనీ ఎవరో కొందరు కావాలని ఆమెను కార్నర్ చేయడానికి ఆమె పేరుతో ఇలాంటి ఫేక్ ట్విట్ చేసి ఉంటారు అన్న సందేహాలు కూడ వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేతిలో సినిమాలు లేకపోయినా ఆమె అవకాశం దొరికినప్పుడల్లా ఎదో ఒక అంశం పై ట్విట్ చేస్తూ సోషల్ మీడియాలో తన మనుగడను కొనసాగిస్తోంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: