మకర సంక్రాంతి అంటే తెలుగు ఆడపడుచులకు నెలరోజుల ముగ్గుల పండుగ. మహిళలలోని కళాత్మక దృష్టిని బయటకు తీసి వారిలో ఇంతమంచి పెయింటర్స్ అని అనిపించే విధంగా ఈ సంక్రాంతి సీజన్ లో ప్రతి ఇంటిముందు కనిపించే ముగ్గులు అనేక అర్ధాలను ఇవ్వడమే కాకుండా ప్రస్తుత రాజకీయ సామాజక విషయాలను స్పురింప చేస్తూ చెక్కిన ముగ్గుల శిల్పాలుగా కనిపిస్తాయి.

ముగ్గుల చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు పరిశోధనలు చేయకపోయినా ముగ్గులు పురాణాల కంటే ముందు పుట్టాయి అన్న అంచనా ఉంది. దీనికి కారణం అన్ని పురాణాలలోను రంగవల్లిక ప్రస్తావన ఉంది. దీనితో ఈ ముగ్గులు వేయడం అనే కళ ఒక చిత్రకళగా అనాది కాలం నుండి మహిళలకు వంశపారంపర్యంగా వస్తున్న ఒక కళాత్మక తృష్ణ అన్న విషయం అర్ధం అవుతుంది. 

ఈరోజున సంభవించే మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాసి లోకి ప్రవేసిస్తాడు. కాబట్టి దానిపేరు 'మకర సంక్రాంతి' అన్న పదం ప్రచారంలోకి వచ్చింది. మకర సంక్రాంతి పురాతన కాలం నాటి పండుగలలో ఒకటి. తూర్పు నుండి పశ్చిమం ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటారు. సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు అయిన శనిని ఈ పండుగరోజు కలుస్తాడనే నమ్మకం కూడ ఉంది. 

ఈ పండుగ ఆనందాలలో భాగంగా గాలిపటాలు ఎగురవేయడం వెనుక చాలా ఆశక్తికరమైన కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా ఎగరేస్తారు.  గాలిపటాలు ఎగరేసే టపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది కాబట్టి ఇలా ఈ సూర్యకిరణాలు మన శరీరానికి తాకడం వల్ల మన శరీరంలో ఉండే అనేక ఇన్ఫెక్షన్లు శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు పోతుందని మన పూర్వీకుల నమ్మకం. అదేవిధంగా ఈ పండుగనాడు చేసే తల స్నానాలు వల్ల మన పాపాలు తొలిగిపోతాయని ఒక నమ్మకం ఉంది. అంతేకాదు ఈ మకర సంక్రాంతి రోజున ఎవరికైనా మరణం సంభవిస్తే మరలా పుట్టుక ఉండదు నేరుగా స్వర్గానికే వెళ్తారని అంటూ ఉంటారు. ఈ మకర సంక్రాంతి రోజున ధన ధాన్యాలతో పల్లెలు అన్నీ సిరి సంపదలతో కళకళలాడుతూ కనిపించే నేపధ్యంలో అతిథి దేవోభవా అంటూ ఇళ్ళు అన్నీ బందు మిత్రులతో కళకళలాడుతూ సంక్రాంతి సంబరాలతో నిండి ఉంటాయి. ఈ మకర సంక్రాంతి రోజున అందరికీ అష్టైశ్వర్యాలు కలగా

మరింత సమాచారం తెలుసుకోండి: