టివి ఆన్ చేస్తే ఏదో ఒక షోలో సందడి చేసే ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ బుల్లితెర మీద తమ టాలెంట్ తో మెప్పించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అభిమానులు కోరుతున్నారనో లేక అవకాశాలు వచ్చాయనో కాని ఇద్దరు హీరోలుగా కొత్త టర్న్ తీసుకున్నారు. ప్రదీప్ కన్నా సుధీర్ మొదట హీరోగా సినిమా చేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ తొలి ప్రయత్నం చేసిన సుధీర్ కు ఆడియెన్స్ షాక్ ఇచ్చారు. స్మాల్ స్క్రీన్ పై తనకున్న క్రేజ్ వాడుకోలేకపోయాడు సుధీర్. అయితే సుధీర్ కు దబ్బ తగిలాక తెలుసుకున్నాడో లేక తన పర్ఫెక్ట్ ప్లానో తెలియదు కాని ప్రదీప్ మాత్రం హీరోగా చేస్తున్న తొలి సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

మున్నా డైరక్షన్ లో ప్రదీప్ హీరోగా వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా నుండి తొలి పాట నీలి నీలి ఆకాశం రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటిస్తున్న ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఒక్క సాంగ్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు ప్రదీప్. అంతేకాదు ఈ సాంగ్ రిలీజ్ అవడమే గంటల్లో మిలియన్ వ్యూస్ దాటేస్తూ షాక్ ఇస్తుంది. సినిమాకు సాంగ్స్ హిట్టయితే సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చినట్టే.

 

సుధీర్ వల్ల కాని పని ప్రదీప్ వల్ల అయ్యింది. ప్రదీప్ సుధీర్ కన్నా సీనియరే తను కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై క్రేజ్ తెచ్చుకున్నాడో ఇక సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మానేశాడు. ప్రదీప్ చేస్తున్న ఈ తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యేలా ఉంది. సినిమా ప్రమోషన్స్ కూడా చాలా క్లవర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: