టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ కాలంలోనే ఎక్కువ స్టార్ డమ్  సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. అంతేకాదు తన యాక్టింగ్ తో పాటు ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా హిట్ కొట్టలేకపోతున్న  విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్  సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 


 ఇకపోతే తాజాగా ఈ షూటింగ్ నిమిత్తం ఓ చోటుకు వెళ్తూ కాలు జారాడు విజయ్ దేవరకొండ. నడుస్తున్న సమయంలో కాలు జారి కింద పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన విజయ్ దేవరకొండ సహాయక సిబ్బంది పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో ముంబైలోని ఓ హార్బర్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఫైటర్ సినిమా షూటింగ్ నిమిత్తం దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత చార్మి సహా... అందరూ ముందు రాగా...  అందరి  తర్వాత వచ్చిన విజయ్ దేవరకొండ నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోయాడు. 

 

 విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ... అక్కడే ఉన్న అభిమానులు అందరూ విజయ్ అన్న విజయ్ అన్నా అంటుంటే అందరినీ పలకరిస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో కాస్త వేగంగా నడిచినా విజయ్ దేవరకొండ... కాలు జారి పడిపోబోయాడు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ... ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో చేస్తున్న పైటర్  సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఒకవేళ ఈ  సినిమా కూడా విజయం సాధించకపోతే విజయ్ దేవరకొండ కెరియర్ అయోమయంలో పడిపోయినట్లు అవుతుంది. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే అటు విజయ్ తో పాటు పూరికి  కూడా మంచి డిమాండ్ ఏర్పడింది అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: