మెగాస్టార్ గా సూపర్ ఇమేజ్ ఉన్న చిరంజీవి తనకున్న మెగా ఫ్యాన్స్ అండతో రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకున్నారు. సామాజిక న్యాయమే ధ్యేయం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి పొలిటికల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాడు అంటే అదో సంచలనం. అయితే చిరు 2008 ఆగష్టులో ప్రజారాజ్యం పార్టీ ప్రకటించారు. చిరు పొలిటికల్ పార్టీ పెట్టగానే మెగా అభినానులంతా ఉత్సాహంతో ఆ పార్టీ కార్యకర్తలుగా చేరారు.

 

అయితే చిరు కూడా అనుకున్నంత రేంజ్ లో తన సత్తా చాటలేకపోయాడు. టికెట్స్ విషయంలో అవకతవకలు జరిగాయని తెలియడంతో మెగా అభిమానులే ఒకింత చిరు పార్టీ పై నెగటివ్ ప్రచారం చేయడం జరిగింది. చిరు పొలిటికల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవడానికి చెప్పుకునే కారణాల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒకరు. ఆయన చేయడం వల్లే ప్రజారాజ్యం పార్టీ అడ్రెస్ లేకుండాపోయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మెగాస్టార్ గా చిరు సినిమాల్లో తన సత్తా చాటగా రాజకీయాల్లోకి వచ్చాక ఆయన్ను ద్వేషించుకునే వారు తయారయ్యారు.

 

సినిమా వేరు.. రాజకీయాలు వేరు.. ఎదో కెమెరా ముందుకు వచ్చి రెండు డైలాగులు చెప్పినట్టు ఉండదు రాజకీయం అంటే.. రాజకీయాల్లో ఎన్నో కుట్రలు.. కుతంత్రాలు.. ఎత్తులు.. పై ఎత్తులు ఉంటాయి. వాటిని గెస్ చేస్తూ అందరిని కలుపుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మరి చిరు ఈ విషయంలో చురుగ్గా ఉండటం కుదరకనే ఇక పార్టీ నడిపించడం కష్టమని భావించి 2011లో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాడు. చిరు విలీనం చేసిన టైంలో ఆయన ఎంత బాధపడ్డాడో ఆయన అభిమానులు కూడా అంట బాధపడ్డారు. రాజకీయాల్లో పడి సినిమాలు వదిలేసినా చిరు మళ్ళీ పదేళ్ళ తర్వాత ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి వెండితెర మీద మగ మహారాజు తానే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: