విక్టరీ వెంకటేష్ చేయలేనిది కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ చేశాడా అని అనుకుంటున్నారు కదా.. కరెక్టే కాని అసలు విషయం ఏంటంటే. ఉదయ్ శంకర్ వెంకటేష్ కి కలిసుందాం రా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడని మనకందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈయన సునీల్ భీమవరం బుల్లోడు సినిమాను తీశాడు. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఉదయ్ శంకర్ నోరు జారాడు.. అసలు మొదట ఈ సినిమా కథ వెంకటేష్ కి చెప్పాడట డైరక్టర్ ఉదయ్ శంకర్. కాని ఈ సినిమాలో ఎక్కువ చేజింగ్ సీన్స్.. చాలా క ష్టమైనా సీన్స్ ఉన్నాయని ఈ సినిమాకి నో చెప్పాడట వెంకటేష్. అయితే వెంకీ ఏ మూడ్ లో ఈ మాటలనాల్సి వచ్చిందో తెలియదు కాని పబ్లిక్ ప్రెస్ మీట్ లో ఉదయ్ శంకర్ అలా అనేసరికి వెంకటేష్ రిస్క్ చేయడానికి ఇష్టపడట్లేదా అని.. ఇంకా కొంతమందయితే వెంకీ చేజింగ్ సీన్స్ కి నో అన్నాడంటే పని అయిపోయిందా అన్నట్లుగా డౌట్ పడుతున్నారు. అసలు ఈ డైరక్టర్ వెంకీ కి ఏ టైం లో కథ చెప్పాడో.. వెంకీ కి కథ నచ్చక ఏం చెప్పి తప్పించుకోవాలో తెలియక ఇలా చెప్పాడో తెలియదు కాని మొత్తానికి వెంకీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాటనేశాడు డైరక్టర్ ఉదయ్ శంకర్. సో అంత పెద్ద స్టార్ గురించి మాట్లాడేటప్పుడు వారి ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని సదరు దర్శక నిర్మాతలు మాట్లాడితే మంచిదని అంటున్నారు సినీ విమర్శకులు. ఉదయ్ శంకర్ మాటలకు మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: