జై సినిమాతో హీరోగా పరిచయమై.. గౌతమ్ ఎస్.ఎస్.సి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో నవదీప్ హీరోగా కాకుండా సినిమాలో చిన్న పాత్రలు సైతం చేస్తూ వచ్చాడు. తేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకోలేని నవదీప్ ఎలాగోలా కెరియర్ సాగిస్తున్నాడు. సినిమాలో ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సై అని చెప్పే నవదీప్ ప్రస్తుతం వెబ్ సీరీస్ లతో దుమ్ముదులిపేస్తున్నాడు. అవును వెబ్ సీరీస్ లో హీరో అనగానే ముందు అందరికి గుర్తొచ్చే పేరు నవదీప్. అప్పట్లో యుప్ టివి వెబ్ సీరీస్ లలో కూడా నటించిన నవదీప్ అమెజాన్ లో కూడా కొన్ని సీరీస్ లు చేశాడు. 

 

ఇక ఇప్పుడు ఆహా యాప్ లో వెబ్ సీరీస్ లు చేస్తున్నాడు నవదీప్. జీ తెలుగులో కొత్తగా మొదలైన అదిరింది షోలో జడ్జ్ గా కూడా కనిపిస్తున్నాడు నవదీప్. ఆ షోలో నవదీప్ మీద ప్లే బోయ్ పంచులు బాగానే పడుతున్నాయి అయినా సరే వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప నవదీప్ వాటిని ఏమాత్రం ఖండించడం లేదు. అప్పట్లో ఒక హీరోయిన్ ను కెలికిన మనోడు ఆ విషయంలో నానా రచ్చ జరుగగా తర్వాత తన హద్దుల్లో ఉన్నాడు. అయితే తర్వాత తన పంథా మార్చేసి తనతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వారితోనే క్లోజ్ గా ఉంటున్నాడు నవదీప్. ఇప్పటివరకు నవదీప్ ఎఫైర్స్ ఏవి బయట పడుకున్నా తనని ప్లే బోయ్ ప్లే బోయ్ అంటూ ఇంతమంది చెబుతున్నారు అంటే కచ్చితంగా ఎదో సీక్రెట్ గా నడిపిస్తున్నాడని అంటున్నారు. 

 

అదిరింది షోలో నవదీప్ పై పంచులు బాగా పేలుతున్నాయి. పక్కన నాగబాబు మీద ఎలాగూ పంచులు వేయలేరు కాబట్టి నవదీప్ పై సరదా పంచులు వేస్తూ షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అటు సినిమాలు ఇటు వెబ్ సీరీస్ లు మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా జడ్జ్ గా కొనసాగుతున్న నవదీప్ కెరియర్ మంచి జోష్ లో ఉందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: