బాలీవుడ్ లో ఖాన్స్ ను కొట్టేవాళ్లు లేరు. వాళ్లను ఎదుర్కోవాలంటే మరో జనరేషన్ రావాల్సిందే అని ట్రేడ్ వర్గాలు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ బాద్ షా అనుకున్న వాళ్లు కూడా సైడ్ అవుతున్నారు. సినిమా చేసేందుకు కూడా వెనకాడే పరిస్థితులు వస్తున్నాయి. దీంతో ఈ బాద్ షా ల ప్లేస్ ను కిలాడీలు ఆక్రమించేశారు. 

 

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురూ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ ను రూల్ చేశారు. టాప్ హీరోస్ అంటే ఖాన్ త్రయమే అన్నట్టు, బాక్సాఫీస్ ని దడదడలాడించారు. అలాంటి హీరోలు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమిర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తర్వాత కొంచెం స్లో అయ్యాడు. లాల్ సింద్ చద్దా స్టార్ట్ చేసేందుకు కొంచెం లేట్ చేశాడు. దీంతో అమీర్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ లో ఉన్నారు. 

 

బాక్సాఫీస్ కా సుల్తాన్ అనిపించుకున్న సల్మాన్ ఖాన్ ఈ మధ్య అంచనాలు అందుకోలేకపోతున్నాడు. భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టడంలో కొంచెం వెనుకబడుతున్నాడు. టైగర్ జిందా హై తర్వాత ఆ రేంజ్ హిట్ లేక అభిమానులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు సల్మాన్. భారత్, దబాంగ్ 3 సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. దీంతో బాయిజాన్ వేగం తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. 

 

అమీర్, సల్మాన్ కొంచెం అటూ ఇటుగా ఉన్నా షారుఖ్ ఖాన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. జీరో తర్వాత షారుఖ్ మరో సినిమా చేసేందుకు కామ్ అయ్యాడు. అప్పటికే వేధిస్తోన్న డిజాస్టర్లు, సొంత సంస్థలో వచ్చిన నష్టాలతో బాద్ షా బండి షెడ్డుకు వెళ్లిపోయింది. ఈ హీరో మరో ఏడాది వరకు సినిమా చేసే పరిస్థితులు లేవని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలీవుడ్ లో ఖాన్ లకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: