లాక్ డౌన్ ప్రభావంతో జనం అంతా ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితులలో బుల్లితెరకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే అనూహ్యంగా ఛానల్స్ వచ్చిన తరువాత రేటింగ్స్ విషయంలో వెనకడుగులో ఉన్న దూరదర్శన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ కు మించి భారీ రేటింగ్స్ పెంచుకోవడమే కాకుండా ఈరోజుకు దూరదర్శన్ ప్రతిరోజు 17 కోట్ల వ్యూస్ వచ్చే రేంజ్ కి ఒకేసారి ఎదిగిపోవడంతో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ కూడ షాక్ అవుతున్నాయి.


అయితే దూరదర్శన్ కు ఇలాంటి ఊహించని మహర్దశ ఏర్పడటానికి రామాయణం సీరియల్ అని తెలుస్తోంది. 1985 ప్రాంతాలలో ప్రసారం అయిన రామాయణం సీరియల్ ను ఇప్పుడు మళ్ళీ రీ టెలికాస్ట్ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లలో ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నా వాటిని చూస్తూ కూడ ప్రతిరోజు రామాయణం సీరియల్ ను క్రమం తప్పకుండ చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతు ఉండటంతో భారతీయ జనజీవన స్రవంతిలో రామాయణానికి ఉన్న ప్రాధాన్యత మరొకసారి రుజువు చేస్తోంది. 


దూరదర్శన్ లో ప్రసారం అవుతున్న ఈ రీ టెలికాస్టింగ్ ద్వారా బుల్లితెర రామాయణం సృష్టి కర్త రామానంద్ సాగర్ కుటుంబ సభ్యులకు భారీ మొత్తాలలో రాయల్టీ రాబోతోంది. అంతేకాదు దూరదర్శన్ లో గతంలో ప్రసారం అయి విపరీతమైన ప్రజాదారణ పొందిన ‘చాణిక్య’ ‘శక్తిమాన్’ ‘సర్కస్’ ‘జంగిల్ బుక్’ సీరియల్స్ మళ్ళీ రీ టెలికాస్టింగ్ అవుతూ ఆ సీరియల్స్ కు కూడ విపరీతమైన రేటింగ్స్ వస్తున్నాయి.


దీనితో రామాయణంలో సీతగా నటించిన దీపిక రాముడుగా నటించిన అరుణ్ గోవిల్ ల హవా మళ్ళీ బుల్లితెర పై కనిపిస్తూ ఈనాటి తరం ప్రేక్షకులకు రామాయణ కావ్యాన్ని గుర్తు చేస్తోంది. ఈ ట్రెండ్ కనిపెట్టి మన తెలుగుకు సంబంధించిన ఒక ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ వచ్చే వారం నుండి మహాభారతం సీరియల్ ను తెలుగు డబ్బింగ్ లో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీనితో కరోనా రామాయణ మహాభారతం లకు కోట్లు కురిపిస్తోంది అని అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: