అల వైకుంఠపురములో సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకు పుష్ప టైటిల్ ఫిక్స్ చేయగా సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచాడు సుక్కు. రంగస్థలం లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్ తన మొదటి హీరో బన్ని కోసం అంతకు మించే హిట్ ఇచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కేరళ అడవుల్లో జరుపుకుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు కొత్త ఒరవడి వచ్చేలా చేశాడు. సోషల్ మెసేజ్ ఇస్తూనే స్టార్ హీరోల ఫ్యాన్స్ మెప్పించేలా మ్యాజిక్ చేస్తాడు. అందుకే కొరటాల శివతో సినిమా అనగానే ఫ్యాన్స్ హిట్టు పక్కా అని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివసినిమా తర్వాత అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడట. 

 

అల్లు అరవింద్ ఈ కాంబో సెట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు కొరటాల శివ కు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి వరుస హిట్లు కొడుతూ కొరటాల శివ కూడా తక్కువ టైం లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి ఆచార్య హిట్టు పడితే ఆ తర్వాత వచ్చే అల్లు అర్జున్ సినిమాకు కూడా భారీ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. మరి బన్ని కొరటాల శివ కాంబో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: