సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు మహేష్ కు సంబంధించిన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ కాని లేదంటే ఆసినిమాకు సంబంధించిన టీజర్ ను కాని విడుదలచేయడం ఒక సాంప్రదాయంగా అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అయితే లాక్ డౌన్ తో మహేష్ సినిమాలు ఏమి షూటింగ్ దశలో లేకపోవడంతో ఈసారి కృష్ణ పుట్టినరోజునాడు మహేష్ తన తండ్రికి ఎలాంటి గిఫ్ట్ ను అందించలేకపోయాడు.


ఇలాంటి పరిస్థితులలో డబ్బూ రత్నానిషేర్ చేసిన ఫోటో ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. డబ్బూ రత్నాని  పేరు అందరికీ సుపరిచితం. ఫోటోగ్రఫీ మీద ఆశక్తి ఉన్నవారికి ఇతడి పేరు ఖచ్చితంగా తెలుస్తుంది. డబ్బూ రత్నాని ఇండియాలో ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఫిలింఫేర్  ఫెమినా  ది మ్యాన్  కాస్మోపాలిటన్  ఓకే ఇండియా లాంటి ప్రముఖ మ్యాగజైన్స్ కవర్ పేజీ ఫోటోగ్రాఫర్ గా ఇతడు వ్యవహరిస్తున్నాడు.


ఇండియాలోని టాప్ సెలబ్రెటీలను తన కెమెరాలో అందంగా బందిస్తూ మంచి ఫోటోలను ఎప్పటి కప్పుడు షేర్ చేయడం ఇతడి అలవాటు. ఈమధ్య ప్రముఖ ఫిజికల్ ట్రైనర్ లాయడ్ స్టీవెన్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సిక్స్ ప్యాక్ తో ఉన్న ఎన్టీఆర్ ఫోటో ఒకటి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోను కూడ డబ్బూ రత్నాని తీసాడు.   ప్రస్తుతం రత్నాని మహేష్ కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ   ‘అందరికీ మనం ఏమి చెప్పకుండానే అర్థం చేసుకునే ఫ్రెండ్ కావాలి’ అంటూ ఒక డాగ్ ఎమోజీ పెట్టి మహేష్ బాబుకి ట్యాగ్ చేసాడు.


ఈఫొటోలో మహేష్ వైట్ కలర్ టీ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని ఒక సోఫా మీద కూర్చొని ఉన్నాడు. పక్కన ఒక పెట్ డాగ్ కూడా ఉంది. ఈఫొటో ఎప్పటిదో తెలియదు కానీ మహేష్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అతని లుక్ చూస్తుంటే ఓల్డ్ పిక్ లా కనిపిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మహేష్ లుక్ ఇలా ఉంది ఏమిటి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య మహేష్ పోస్ట్ చేస్తున్న వీడియోస్ ఫోటోలలో మహేష్ తన కొడుకు గౌతమ్ కి కూతురు సితార లకి అన్నగా కొత్త లుక్ లో కనిపిస్తున్న విషయంతెలిసిందే. ఇది ఇలా ఉండగా మహేష్ పరుశు రామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో నటిస్తున్న మూవీ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుగుతాయి అన్నవార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: