తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు 150కి పైగా సినిమాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు, ఇక ఇప్పటి వరకు మెగా స్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో  వైవిధ్యమైన నటనతో అలరించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు అని  చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపుగా అన్ని రకాల పాత్రలను మెగాస్టార్ చిరంజీవి నటించిన తన నటనతో మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 

 

 అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పోలీస్ పాత్రలో నటించి అలరించిన  సినిమా ఎస్పీ పరశురామ్. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ పాత్రలో నటించిన తీరు తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా ఎస్.పి.పరశురాం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పోలీస్ పాత్రలో తన నటన తో పవర్ ఫుల్ యాక్షన్ తో ఇరగదీశాడు అనే చెప్పాలి. అసలు సిసలైన పోలీస్ అంటే ఇలాగే ఉండాలి అని తెలుగు ప్రేక్షకులందరూ భావించేంతగా  ప్రభావితం చేశారు మెగాస్టార్ చిరంజీవి. 

 

 ఇక ఎస్పీ పరశురామ్ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. ఇక ఈ సినిమాలో పోలీస్ పాత్రలో చిరంజీవి నటన ఎంతో పవర్ఫుల్గా సాగిపోతుంది... పోలీస్ పాత్రలో రౌడీ లందరికీ గుబులు పుట్టిస్తూ అందరి ఆగడాల ను అరికడుతూ  ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక పోలీస్ పాత్ర మెగాస్టార్ చిరంజీవి కి సరిగ్గా సెట్ అయింది అని చెప్పాలి. ఇక ఎలాంటి పాత్రలోనై నా ఒదిగిపోయి నటించే  మెగాస్టార్ చిరంజీవి ఎస్పీ పరశురామ్ పాత్రల లో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: