ఆలియా భట్ ఒకవైపు పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతుంటే.. హీరోలు మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. తమతో ఒక్క స్టెప్పేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్స్ పెడుతున్నారు. తెలుగు హీరోలు కూడా ఇలాగే తమతో డ్యూయెట్స్ పాడాలని.. ఆ తర్వాత ఆమె ఇష్టమని ఆలియాకు కోట్లు ఆఫర్ చేస్తున్నారు.
రణ్ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని, మ్యారిడ్ లైఫ్ స్టార్ట్ చేయాలని ఆరాటపడుతోంది ఆలియా భట్. కానీ ఇండస్ట్రీ మాత్రం ఆమెకు పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేకుండా వరుస అవకాశాలు ఇస్తోంది. బాలీవుడ్ బిగ్గీస్ తో పాటు తెలుగు స్టార్లు కూడా ఆలియానే కావాలంటూ కోట్లు ఇస్తున్నారు.
ఆలియాభట్ ఇప్పటికే తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది ఆలియా. ఇక రాజమౌళితో పాటు, ప్రభాస్ కూడా ఈమెకు ఆఫర్ ఇస్తున్నాడని టాక్ వస్తోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీలో ఆలియానే హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఆలియాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.
ఆలియా భట్ చూసేందుకు చాలా యంగ్ గా కనిపిస్తుంది గానీ.. యాక్టింగ్ లో సీనియర్లను కూడా వెనక్కినెట్టేస్తుంది. పైగా ఆమెకు బాలీవుడ్ లో సూపర్ మార్కెట్ ఉంది. అందుకే పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న తెలుగు హీరోలు హిందీ మార్కెట్ కోసం ఆలియాను కాంటాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ క్రేజ్ తో ఆలియా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు.
మొత్తానికి ఆలియా భట్ పెళ్లి చేసుకుందామని ఆరాటపడుతుంటే.. హీరోలు మాత్రం వెనక్కి లాగుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. చూద్దాం.. ఆలియా కనికరిస్తుందో లేదో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి