సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు ఆగష్టు 9 ఓ పండుగ రోజు. మహేష్ బర్త్ డే రోజు ఏదో క సర్ ప్రైజ్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ అందిస్తాడు మహేష్. సెట్స్ మీద ఉన్న సినిమా నుండి క్రేజీ అప్డేట్ తో పుట్టినరోజు కానుక ఇచ్చేవాడు. అయితే ఈసారి కూడా అలాంటి సర్ ప్రైస్ ట్రీట్ ఏదైనా ఇస్తాడని భావించిన ఫ్యాస్ కు నిరాశ మిగిలేలా ఉంది. మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ఎనౌన్స్ చేశారు.

 

ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. అందుకే ఆగష్టు 9న మహేష్ బర్త్ డే రోజు ఎలాంటి గిఫ్ట్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే షూటింగ్ జరగకపోయినా సినిమాకు సంబందించిన ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఆరోజు ఇచ్చి తీరుతారని మాత్రం అంటున్నారు. ఇప్పటికే పరశురాం, మహేష్ కాంబో సినిమాను డిక్లేర్ చేస్తూ సర్కారు వారి పాట మహేష్ ప్రీ లుక్ సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి.

 

పరిస్థితులు మాములుగా ఉంటే ఈపాటికి సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సింది కాని చూస్తుంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు సినిమా షూటింగ్ జరుపుకునేలా లేదు. అందుకే సర్కారు వారి పాట నుండి ఎలాంటి టీజర్ గాని, ఫస్ట్ లుక్ గాని వచ్చే ఛాన్స్ లేదు. అయితే మహేష్ తన నెక్స్ట్ సినిమా న్యూస్.. క్రేజీ కాంబినేషన్స్ ఇలాంటివి ఏదైనా ఎనౌన్స్ చేసి అభిమానులను అలరించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా పొలిటికల్ సెటైర్ గా రాబోతుంది. గీతా గోవిందం తర్వాత పరశురాం డైరెక్ట్ చేసే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: