అమ్మోరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సునైనా ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు ఇలా చాలా చేస్తూ వచ్చింది. ఈమధ్య సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా వీడియోలు చేస్తున్న సునైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె చేసే వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ నిర్వాహకుల కన్ను పడుతుంది. ఈ క్రమంలో సునైనాని కూడా బిగ్ బాస్ సీజన్ 4 కోసం అడిగారట.   

 

ఈసారి సెలబ్రిటీ కంటెస్టంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4లో సునైనాని తీసుకోవాలని అనుకున్నారు. అయితే సునైనా రోజుకి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అమ్మడు అడిగిన రెమ్యునరేషన్ కు బిగ్ బాస్ నిర్వాహకులు షాక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికి ఇంకా సునైనాతో డిస్కషన్స్ ఫైనల్ అవలేదని తెలుస్తుంది. ప్రతి సీజన్ లో సోషల్ మీడియా స్టార్స్ ను సెలెక్ట్ చేయడం కామనే.. కాబట్టి ఈసారి సునైనాని ఎలాగైనా బిగ్ బాస్ కి సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు.  

 

సీజన్ 4 హోస్ట్ గా మళ్ళీ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. ఈ సీజన్ కోసం భారీ మొత్తాన్నే ఛార్జ్ చేస్తున్నాడట నాగార్జున. ఈ సీజన్ లో 15 మంది కంటెస్టంట్స్ గా వస్తారని తెలుస్తుంది. మూడు సక్సెస్ ఫుల్ సీజన్లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 4 ఎలా అలరిస్తుందో చూడాలి. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టంట్స్ చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: