టాలీవుడ్ డైరక్టర్స్ లో క్రిష్ టాలెంట్ అందరికి తెలిసిందే. తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుంది. హిస్టారికల్ మూవీస్ చేస్తూ తన మార్క్ చూప్స్తున్న క్రిష్ ఇప్పుడు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను కూడా చేస్తున్నాడు. వెబ్ సీరీస్ లను నిర్మిస్తూ అలా కూడా సంపాదిస్తున్నాడు క్రిష్. ఇప్పటికే ఆహా ఓటిటిలో రెండు వెబ్ సీరీస్ లను రిలీజ్ చేసిన క్రిష్ తన నెక్స్ట్ వెబ్ సీరీస్ కు సన్నాహాలు జరుగుతున్నాయట.

 

ఇక క్రిష్ నిర్మాతగా త్వరలో తెరకెక్కే వెబ్ సీరీస్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెలుస్తుంది. మన్మథుడు2 తర్వాత తెలుగులో సినిమాలు లేక ఖాళీగా ఉన్న రకుల్ లాక్ డౌన్ కు ముందు ముంబై చెక్కేసింది. ఈమధ్యనే అమ్మడు మళ్ళీ హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కెరియర్ లో వెనకపడ్డ రకుల్ ఎలాగైనా మళ్ళీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా మాత్రమే చేస్తున్న రకుల్ వెబ్ సీరీస్ చేయడంపై ఆసక్తి ఏర్పడింది.

 

అందులోనొ ఉమెన్ సెంట్రిక్ వెబ్ సీరీస్ అనగానే ఈ వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో అన్న ఇంట్రెస్ట్ ఏర్పడింది. క్రిష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సీరీస్ ఆహా లో అందుబాటులోకి వస్తుంది. స్టార్ హీరోయిన్స్ అంతా ఈమధ్య సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నారు. మరి రకుల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

 

క్రిష్ సినిమాల విషయానికి వస్తే మాత్రం ఎన్.టి.ఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత కొన్నాళ్ళు కనిపించకుండా పోయిన ఈయన ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు.       

 

మరింత సమాచారం తెలుసుకోండి: