ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ వి.ఐ ఆనంద్ డైరక్షన్ లోనే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. రవితేజ డిస్కో రాజాతో పాటుగా మరో కథ కూడా చెప్పాడట ఆనంద్ అయితే మొదటి కథ నచ్చినా డిస్కో రాజా వర్క్ అవుట్ అవుతుందని తీశారట. ఇది ఆడలేదు కాబట్టి ఆ డైరక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చి మరో సినిమాను చేయాలని అనుకుంటున్నాడు రవితేజ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సక్సెస్ అందుకున్న వి.ఐ ఆనంద్ ఆ తర్వాత అల్లు శిరీష్ తో చేసిన ఒక్క క్షణం అంచనాలను అందుకోలేదు. ఇక రవితేజ డిస్కో రాజా ఫలితం తెలిసిందే.
అయితే ఓసారి ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా చేయాలని ఎవరు అనుకోరు కాని వి.ఐ ఆనంద్ ఈసారి చెప్పిన కథ నిజంగానే వర్క్ అవుట్ అవుతుద్నని భావిస్తున్నాడట రవితేజ. అంతేకాదు ఈ సినిమా డిస్కో రాజా నిర్మించిన నిర్మాతలకే డైరక్టర్, హీరో ఇద్దరు ఫ్రీగా చేసి పెట్టాలని అనుకుంటున్నారట. మరి రవితేజ సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి