మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సైరా సినిమాతో సత్తా చాటిన చిరు ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవింద్ర సినిమా ఉండొచ్చని టాక్. చిరుని మెప్పించే కథతో రవింద్ర రాగా అతనితోనే తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ గా వినాయక్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

అయితే చిరంజీవితో సినిమా కోసం డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కోసం ఆటో జానీ కథ రాసుకున్న పూరీ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు మెప్పించినా సెకండ్ హాఫ్ నచ్చలేదని చిరు రిజెక్ట్ చేశాడు. ఇక చిరు కోసం మరో వర్షన్ తీసుకెళ్ళి పూరీ లేటెస్ట్ గా మరోసారి చిరుని కలిశాడట.

అయినా సరే పూరీ వర్షన్ మెచ్చలేదట చిరు. ఆటో జానీ కథనే మళ్ళీ చెప్పాడో లేక మరో కథ చెప్పాడో కాని చిరు సినిమా కోసం పూరీ ఎంత ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ మాత్రం అవట్లేదు. ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్న పూరీ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి పూరీ డైరక్షన్ లో చిరు సినిమా ఎప్పుడు ఉంటుంది.. చిరుని మెప్పించే పనిలో ఉన్న పూరీ మరో కథతో సిద్ధమవుతున్నాడట. మరి పూరీ చిరు సినిమా ఎప్పుడు ఉంటుంది.. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.            

మరింత సమాచారం తెలుసుకోండి: