తమన్నా టాలీవుడ్ లో,
కోలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. గతేడాది
వెంకటేష్ తో
f2 సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక పోతే మొన్నటికి మొన్న
రవితేజ సినిమాలో నటించమని దర్శకనిర్మాతలు తమన్నాను సంప్రదిస్తే.. 3 కోట్ల వరకూ పారితోషికం అడిగిందట. దాంతో ఆ దర్శక నిర్మాతలు.. ‘ఫేడౌట్ అయిపోయినా సరే, ఇంకా అంత డిమాండ్ చేస్తున్నారేంటి?’ అంటూ
తమన్నా పై మండిపడ్డారంటూ టాక్ నడిచింది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం తమన్నాకు ఆఫర్లు బాగానే వస్తుండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్-
సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తుంది.



అది కాకుండా యంగ్ అండ్ ట్యాలెంటెడ్
హీరో అయిన సత్యదేవ్ నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రంలో
తమన్నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఈ చిత్రంతో పాటు
తమన్నా మరో బంపర్ ఆఫర్ కూడా కొట్టేసిందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్
హీరో విజయ్ తో.. స్టార్
డైరెక్టర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘తుపాకీ’ కి సీక్వెల్ అనే టాక్ నడుస్తుంది.



ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో
హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే తమన్నాకు ఇది మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. 10 ఏళ్ళ క్రితం
విజయ్ కు జోడీగా ‘సుర’ అనే చిత్రంలో నటించింది తమన్నా.