ఇక ఇదిలాఉంటే రష్మిక మందన్న తెలుగులో విజయ్ దేవరకొండతో రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒక సినిమా హిట్ అవగా మరో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబో ఆడియెన్స్ లో ఫుల్ పాపులర్ అయ్యింది. అయితే విజయ్ తో రష్మిక ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ గా కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సినిమాల్లో చేసినా చేయకపోయినా ఇద్దరు బయట ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. దీన్ని నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నా సరే వారు మాత్రం ఏమి పట్టిచుకోవడం లేదు.
అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఇంట్లో పార్టీలో దర్శనమై షాక్ ఇచ్చింది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ మదర్ బర్త్ డే పార్టీలో రష్మిక సందడి చేసింది. కేవలం ఆ హీరో ఫ్యామిలీ సభ్యులు మాత్రమే అటెండ్ అయిన బర్త్ డే పార్టీలో రష్మిక కూడా ఎంటరై సర్ ప్రైజ్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది అర్ధం కాకపోయినా సరే విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్ కు కేవలం రష్మికను మాత్రమే పిలిచేంత క్లోజ్ అని మాత్రం తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి