ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. 16 భాషల్లో వేలాది పాటలు పాడిన గాయకుడు.. తన గానంతో ప్రాణ ప్రతిష్ట చేసిన మహానుభావుడు.. అయితే సినిమా ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టు చనిపోతేనే... టాలీవుడ్ అంతా పరామర్శలకు క్యూ కట్టేస్తోంది. అంత్యక్రియలు అయ్యే వరకూ అండగా నిలుస్తుంది. అయ్యో మావాడు.. అంటూ గుండెలు బాదుకుంటుంది. అన్ని వ్యవహారాలు దగ్గర ఉండి చూసుకుంటుంది. కానీ.. బాలు విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.

ఎస్పీ బాలు.. అటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్ని భాషల సినీపరిశ్రమలకు ఆప్తుడే.. కానీ అలాంటి మహానుభావుడి అంత్యక్రియలకు వీఐపీల రాక మాత్రం చాలా తక్కువగానే కనిపించింది. ప్రముఖులు చాలా మంది బాలు కడసారి చూపుకు హాజరుకానే లేదు. అయితే కోవిడ్ నిబంధనలు ఇందుకు ఓ కారణం కావచ్చు. కానీ.. కోవిడ్ కారణంగానే ఇలా జరిగిందా అన్నది ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.

ఒక భారతీరాజా.. ఓ హీరో విజయ్.. ఓ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇంకా ఒకరో ఇద్దరో.. అంతే .. నిన్న ఎస్పీ బాలు అంత్య క్రియలకు హాజరైన ప్రముఖులు దాదాపుగా వీరే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సినిమా ఇండస్ట్రీలో అంతా ఆత్మీయులే.. చిన్నా పెద్దా అంతా ఆయన్ను అభిమానించేవారే.. కానీ వారిలో చాలా మంది బాలు అంతిమ సంస్కారాలకు హాజరు కానే లేదు.. ఆయన్ను చివరి సారి చూసుకునేందుకు తరలి రాలేదు.  

దీనికంతటికీ కరోనాయే కారణం కావచ్చు.. దేవిశ్రీ ప్రసాద్ ఆ మాటే అన్నాడు కూడా.. ఈ కరోనా లేకపోతే.. ఆయన వీడుకోలు ఎంత ఘనంగా ఉండేదో.. ఏం చేస్తాం.. అని.. కానీ.. నిజంగా బాలుకు కడసారి వీడ్కోలుకు సినీ పరిశ్రమ తరలిరాకపోవడానికి కరోనాయే కారణమా.. కరోనా నిబంధనలు పాటిస్తూనే.. చివరి వీడ్కోలు పలకలేకపోయారా.. ఏమో..?
 

మరింత సమాచారం తెలుసుకోండి: