ఇందులో భాగంగా.. రాజకీయాల పై డిస్కషన్ వచ్చింది. ఇంకేముంది మన రౌడీ తనదైన శైలిలో రాజకీయాల గురించి స్పందించాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. విజయ్ మాట్లాడుతూ.. “21 సంవత్సరాల ఏజ్ వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడమనేది కరెక్ట్ కాదు.డబ్బు కోసం, మందు కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు అస్సలు ఉండొద్దు.అలా ఓటును అమ్ముకునే వాళ్ళకు ఓటు విలువ ఏం తెలుస్తుంది? డబ్బున్న వాళ్లకు కూడా అంతే.! వాళ్ళలో చాలామంది అసలు ఓటు వెయ్యరు.
వాళ్ళకు ఓటు విలువ తెలీదు. కాబట్టి వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దు. మంచిగా చదువుకుని ఓటు హక్కు విలువ అలాగే పరిపాలన విలువ తెలిసుండి.. ‘వీడు మనల్ని బాగా పరిపాలిస్తాడు రా భయ్’ అనుకున్న మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసి కంటే కూడా డిక్టేటర్షిప్ మంచిది. అలా అయితేనే జనాలు దారిలోకి వస్తారు” అంటూ వ్యాఖ్యానించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "ఫైటర్" మూవీ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి