ఇక ఆ తర్వాత వచ్చిన త్రివిక్రం అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను సైతం తిరగ రాశాడు బన్నీ. అయితే నా పేరు సూర్య ఫ్లాప్ అవడంతో వక్కంతం వంశీ డైరక్షన్ అనగానే స్టార్స్ భయపడుతున్నారు. అయితే లేటెస్ట్ గా రాం చరణ్ వక్కంతం వంశీ చెప్పిన లైన్ విన్నాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాడట.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయం మీద క్లారిటీ రాలేదు. ఇద్దరు ముగ్గురు దర్శకులు ప్రయత్నిస్తున్నా చరణ్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కథ సూపర్ అనుకున్న డైరక్టర్ కే ఓకే చెప్పాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వక్కంతం వంశీ డైరక్షన్ లో రాం చరణ్ సినిమా ఉంటుందని ప్లాన్. అదే జరిగితే ఈసారి వక్కంతం వంశీ టాలెంట్ ఏంటన్నది చూపిస్తాడని ఆశిస్తున్నారు. మరి చరణ్ కనుక వంశీ సినిమా ఫిక్స్ చేస్తే మాత్రం రైటర్ కమ్ డైరక్టర్ కు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టే. ప్రూవ్ చేసుకోవడం ఇక అతని చేతుల్లోనే ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి