సోనూ సూద్.. ఈ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. అతను చేసే సేవా కార్యక్రమాలు, సాయం కోరిన వారి కోరికలను తీర్చడం లాంటివి చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ వలస కార్మికులకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఇక్కడే ఉండిపోయి.. కుటుంబ సభ్యుల పై ఆశలు వదిలేసుకున్న వారందరి కన్నీరును తుడిచాడు. అందుకే ఇప్పుడు రియల్ హీరో గా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఆ విధంగా చేయడం పై చాలా మంది విమర్శలు కూడా గుప్పించారు. అయిన అతను వెనకడుగు వేయలేదు.



ఇదే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను సోనూ సూద్ చేస్తున్నాడు. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. చదువుకోలేనీ పేద పిల్లలకు మంచి స్కూల్స్ లో చదివే అవకాశాన్ని అందిస్తున్నాడు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్య ఉంది అంటే ఖర్చు విషయంలో వెనకాడకుండా ముందుకు వచ్చేవాడు. మొత్తానికి ఈ లాక్ డౌన్ లో పేదల పాలిట దేవుడయ్యాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను అందించాడు.తన తల్లి పేరిట స్కాలర్‌షిప్స్ అందించడానికి ముందుకొచ్చారు. అది కూడా ఐఏఎస్ కావాలని కలలుగనే పేద విద్యార్థుల కోసం.



తన తల్లి సరోజ్ సూద్ 13వ వర్థంతి సందర్భంగా సోనూ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనూ సూద్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె తల్లిని ఎంత మిస్ అవుతున్నాడు అనే విషయాన్ని తెలిపాడు సోనూ సూద్..గతంలో జూలై 21 న తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరికీ తెలిసిందే.. ఆమె మరణించిన ప్రజల చిరు నవ్వులో కనిపిస్తుందని అతను నమ్ముతున్నాడు. అందుకే ఇప్పుడు తాను సంపాదించిన పావు వంతు సంపాదనను ఇలా ఉపయోగిస్తున్నాడు..సోనూ సూద్ చేస్తున్న ఈ విధమైన పనులకు  ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా చాలా మంది ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: