అయితే ఇదే టైం లో సంచాలకుడిగా సోహెల్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అవినాష్. సోహెల్ ఒక సైడ్ వారికే సపోర్ట్ చేశాడని.. సేఫ్ గేమ్ ఎవరు ఆడట్లేదని అన్నాడు. అవినాష్ ఫైర్ అవడంతో నాగార్జున ఇచ్చిన మాట కోసం ఏమి మాట్లాడలేదు సోహెల్. తనకు కోపం వచ్చినా సరే ఆపుకున్నాడు. తన కోపాన్ని చెయిర్ మీద చూపించాడు. ఇక డైనింగ్ టేబుల్ మీద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.
అవినాష్ కోప్పడితే ఇలా ఉంటుందా అని అందరికి అర్ధమైంది. గొడవ పడొద్దని నాగార్జున చెప్పిన కారణంగా సోహెల్ చాలా కంట్రోల్ గా ఉంటున్నాడు. మొత్తానికి హౌజ్ లో తనని మార్చుకునే క్రమంలో సోహెల్ తన కోపాన్ని జయించాలని అనుకుంటున్నాడు. ఆరవ వారం కూడా కెప్టెన్ గా నోయెల్ ఎంపికయ్యాడు. అయితే ఈ టాస్క్ లో భాగంగా నోయెల్ నామినేషన్స్ లో కూడా ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి