ఇప్పుడున్న పరిస్తితుల్లో థియేటర్లు ఓపెన్ అయితే ప్రేక్షకులు వస్తారన్న గ్యారెంటీ లేదు. దసరా టైం కల్లా మళ్లీ ఏదైనా జోష్ వస్తుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం బుల్లితెర మీద మాత్రం రకరకాల షోలతో ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్టైణ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏడేళ్లుగా జబర్దస్త్ నవ్విస్తూనే ఉంది. గురు, శుక్రవారాలు జబర్దస్త్ వస్తే టివిలకు అతుక్కుపోతున్నారు. ఇక ఆదివారం వస్తే చాలు అదిరింది చూసేస్తున్నారు.

ఇక కొత్తగా బిగ్ బాస్ సీజన్ మొదలైతే చాలు ఆ 100 రోజులు హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగా తమ ఇంటితో పాటుగా బిగ్ బాస్ మీద కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. మొత్తానికి థియేటర్లలో సినిమాలు చూడకపోయినా సరే ఆడియెన్స్ తమకు కావాల్సిన ఎంటర్టైన్ అంతా కూడా బుల్లితెర మీద పొందుతున్నారు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కూడా కొత్త షోస్ తో అలరిస్తున్నాయి. స్టార్ మాకి బిగ్ బాస్ ఒక్కటి చాలు.. ఈటివికి ఎవర్ గ్రీన్ జబర్దస్త్ ఉండనే ఉంది.

ఇక ఎటొచ్చి జీ తెలుగుకే అదిరిందిని బొమ్మ అదిరిందిగా మార్చారు.. ఈమధ్యనే సరిగమప 2020 సీజన్ మొదలైంది. ఆ షో కాస్త ఆడియెన్స్ ను అలరిస్తుంది. మొత్తానికి మూడు ఛానెల్స్ ఆడియెన్స్ ను తమవైపుకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసున్నయి. ఇక వీటిలో జెమిని మాత్రం చాలా వెనకపడ్డదని చెప్పొచ్చు. జెమినిలో కూడా ఎంటర్టైనింగ్ షోస్ ఉన్నా కూడా అవి పెద్దగా ఆడియెన్స్ ను అలరించేలా ఉండట్లేదని చెప్పొచ్చు. రియాలిటీస్ షోస్ లో మాత్రం ఈ మూడు ఛానెల్స్ ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: