బిగ్ బాస్ సీజన్ 4లో అరియానా మరోసారి ప్రేక్షకుల మనసులను మాత్రమే కాదు హౌజ్ మేట్స్ మనసులు మాత్రమే గెలిచింది. హౌజ్ లో ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు అవినాష్, అరియానా పోటీ పడగా అందులో అరియానా ఓడిపోగా అవినాష్ కొత్త కెప్టెన్ అయ్యాడు. అయితే హారిక కోరిక మేరకు అరియానాని రేషన్ మేనేజర్ గా ఎంపిక చేశాడు అవినాష్.

ఇదిలాఉంటే రేషన్ మేనేజర్ గా ఉన్న అరియానాని బిగ్ బాస్ స్టోర్ రూం లోకి పిలిచి అక్కడ వారం మొత్తం రేషన్.. అభిజిత్ బట్టలు, ఇక కొన్ని వస్తువులు ఉంచాడు. ఇక వీటిలో ఏది కావాలో ఆమెను తేల్చుకోమని చెప్పాడు. అయితే అభిజిత్ కు ఈ వారం మాత్రమే బట్టలు ఇవ్వరా సీజన్ మొత్తం ఇవ్వరా అని బిగ్ బాస్ ను ఎదురు ప్రశ్న అడిగింది.. అయితే బిగ్ బాస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అరియానా అభిజిత్ కు సారీ చెప్పి రేషన్ మాత్రమే ఎంచుకుంది.  

అరియానా నిర్ణయానికి హౌజ్ మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. అభిజిత్ బట్టలను మాత్రమే తీసుకుంటే ఈ వారం అందరు రేషన్ లేక ఇబ్బందులు పడేవారు కాని అరియాన తన తెలివితేటలతో అభిజిత్ బట్టలని కాకుండా రేషన్ ను తీసుకుంది. దానితో హౌజ్ మేట్స్ కూడా అరియానా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు అరియానా తీసుకున్న ఈ నిర్ణయం ఆడియెన్స్ ను మెప్పించింది. హౌజ్ లో ఫీమేల్ కంటెస్టంట్స్ లో అరియానా నంబర్ 1 గా నిలుస్తుందని చెప్పొచ్చు.                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: