ఒకప్పుడు తీన్ మార్ వార్తలంటే బిత్తిరి సత్తి.. బిత్తిరి సత్తి అంటే తీన్మార్ వార్తలు.. కానీ అనేక కారణాల వల్ల బిత్తిరి సత్తి తీన్మార్ ను వదిలి వెళ్లాడు. ఆ తర్వాత సావిత్రి కూడా వెళ్లిపోయాక ఆ స్థానాన్ని రాధ, చంద్రవ్వ వంటి వారితో భర్తీ చేశారు కానీ.. బిత్తిరి సత్తి ప్లేస్ మాత్రం కొంత కాలం అలాగే ఉండిపోయింది.  కొన్నాళ్ల క్రితం ఆ ప్లేస్‌లో అడుగు పెట్టిన సదన్న బాగానే అలరిస్తున్నాడు. తీన్మార్ వార్తల కంటే ముందే యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సదన్న.. తీన్మార్‌లోనూ దుమ్మురేపుతున్నాడు.  

యాంకర్ రాధతో బుజ్జీ బుజ్జీ అంటూ కెమిస్ట్రీ బాగానే మెయింటైన్ చేస్తూ.. తెలంగాణ ప్రజలకు బాగానే అలవాటైపోయాడు. తీన్మార్‌లో విజయవంతంగా సెటిలయ్యాడు. జానపదులకే పుట్టిన తల్లిగా, పల్లె సుద్దులకే వన్నె తెచ్చిన ఎంతోమంది తెలుగు కళాకారులను అందించిన ఉద్యమాల ఊపిరి గడ్డ, నవ చైతన్య గీతిక కరీంనగర్ జిల్లాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సదన్న.. చూపులకు అలా కనిపిస్తాడు కానీ చాలా గట్టి పిండమే.

విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు లిటరేచర్ రూపంలో తన పీజీ ఉన్నత విద్య పూర్తి చేశాడు.  రెండు పీజీలు చేశాడు. బీఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగమైన ఉపాధ్యాయ వృత్తిని సంపాదించి 20 సంవత్సరాలు పాఠాలు చెబుతున్నాడు. హాస్య చతురత గల సదన్న చిన్నప్పటి నుండి ఉన్న సదుపాయాలను కలిసొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ తనకున్న ఆలోచనలను సమాజంపై ఉన్న అవగాహనను, గ్రామీణ ప్రాంతంలో నివసించే పల్లెవాసుల జీవన గమనంపై, వర్తమాన కాలంలో అనుసరిస్తున్న సంప్రదాయాలు, మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు.

మనసుకు హత్తుకునేలా నటిస్తు చూపరులను ఇట్టే ఆకట్టుకునే రీతిలో హాస్యాన్ని ఉర్రూతలూగించడంలో దిట్ట. తన నటనని ప్రదర్శించే విధంగా కాకుండా సాధారణంగా కనిపించేలా నటిస్తూ, హాస్య కళలకే వన్నె తెచ్చేలా జీవిస్తుంటాడునేటికీ ఎన్నో రకాల హాస్య భరిత సన్నివేశాలతో కూడిన  పల్లె ప్రజల మనసులను కొల్లగొట్టి షార్ట్ ఫిల్మ్ లు అందించాడు. v6 న్యూస్ ఛానెల్ ద్వారా మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతి రోజూ దానిలో వచ్చే ఫన్నీ బిట్ తో అందరికీ మరింతగా సుపరిచతమయ్యాడు సదన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: