తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కుటుంబాన్ని చాలా గోప్యంగా ఉంచే హీరోల్లో వెంకటేష్ ముందుంటాడు. ఈయన తన సతీమణి నీరజను ఎక్కడికి బయటికి పెద్దగా తీసుకుని రాడు. సినిమా వేడుకల్లో కూడా ఈమె ఎక్కువగా కనిపించదు. అప్పుడప్పుడూ ఫ్యామిలీ వేడుకల్లో మాత్రమే కనిపిస్తుంటారు నీరజ దగ్గుబాటి. సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా ప్రైవేట్ లైఫ్‌లోనే వాళ్లు కంఫర్టుగా ఉంటారు విక్టరీ వెంకటేష్.

అయితే వెంకటేష్ భార్య గురించి మీకు తెలియని నిజాలు ఇప్పుడు చూద్దామా. వెంకటేష్ భార్య పేరు నీరజ. వెంకటేష్ పుట్టింది 13 డిసెంబరు 1960 కాగా వెంకటేష్ కి నీరజకి వివాహం 1985 లో జరిగింది. వెంకటేశ్ చౌదరి సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. ఆయన భార్య నీరజ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. అయితే వెంకటేష్ కు పెళ్లి చేయాలని భావించిన రామానాయుడు కొడుకుని బాగా అర్థం చేసుకోగలిగిన ఒక మంచి అమ్మాయి కావాలని ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగిరెడ్డిని అప్పట్లో అడిగారట.

అయితే అందుకు ఆయన మీ సామాజికవర్గంలో ఏమో కానీ మాకు సమీప బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది. ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగిరెడ్డి చెప్పాడట.. దీంతో రామానాయుడు ‘నాకు అలాంటి పట్టింపు లేదని చెప్పడంతో తన బంధువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజారెడ్డిని రామనాయుడికి చూపించారు. ఆయనతో పాటు వెంకటేష్ కి కూడా ఆమె చూపించడం.. దాంతో నీరజ రెడ్డికి కూడా వెంకటేశ్ నచ్చడంతో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేష్ కి 25 ఏళ్ల వయసులో నీరజతో పెళ్లి జరిగింది. ఇప్పుడు నీరజ వయస్సు 48 ఏళ్లు . వెంకటేష్ నీరజ లకి మొత్తం నలుగురు సంతానం. అందులో 3 అమ్మాయిలు ఒక్క అబ్బాయి. నీరజ వెంకటేష్ ల కూతుర్ల పేర్లు ఆశ్రిత, హయవాహినీ, భావన, కొడుకు అర్జున్ రాంనాథ్.. ఇంట్లో పిల్లలకి అవసరం అయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గర ఉంది మరి చూసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: