బుల్లితెరపై శ్రీముఖి కీ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులందరికీ అపరిచితురా లి  గా ఉన్న శ్రీముఖి పటాస్ ప్రోగ్రాం ద్వారా ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో సినిమా ఈవెంట్లు చేసుకుంటూ తనదైన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ యాంకర్ గా తన సత్తా చాటుతూనే మరోవైపు సినీ నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది  ఈ అమ్మడు.



 పటాస్ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించిన శ్రీముఖి ఆ తర్వాత... బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు చివరి వరకు అందరూ తెలుగు ప్రేక్షకులను అలరించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు ఒక్క అడుగు దూరంలో కేవలం రన్నరప్ తో  సరిపెట్టుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా తన జోరు ఎక్కడ తగ్గించకుండా వరుసగా షోలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ  పండుగ ఈవెంట్ చూసినా కూడా శ్రీముఖి యాంకర్ గా దర్శనమిస్తోంది.



 కాగా చలాకీగా కనిపిస్తూ తన వాక్చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకునే శ్రీముఖి ప్రస్తుతం ఓ వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి శ్రీముఖి మనసును దోచేసినట్లు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానులందరూ శ్రీముఖి ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రీముఖి ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి  కానీ  శ్రీముఖి వాటిపై ఇప్పటివరకు స్పందించలేదు. శ్రీముఖి ఎవరితో ప్రేమలో పడింది అన్న విషయం కూడా ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉండిపోయింది. శ్రీముఖి ప్రేమలో పడింది ఎంత నిజం అనేది మాత్రం రానున్న రోజుల్లో కాలమే చెబుతుంది మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: