బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి వారం నుండి అఖిల్, మోనాల్ చాలా క్లోజ్ అయ్యారు. వీరిద్దరు ఒకరి ఆటకి మరొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే వారాలు గడుస్తున్నా కొద్ది అఖిల్ మోనాల్ ల మధ్య దూరం పెరుగుతుంది. అదెలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లిన తర్వాత అఖిల్, మోనాల్ ల మధ్య దూరం పెరిగింది.

సోమవారం నామినేషన్స్ లో కూడా అఖిల్ ను స్వాప్ చేసుకునే ఛాన్స్ ఉండి కూడా మోనాల్ ఆమె ఆ త్యాగం చేయలేకపోయింది. అంతేకాదు అఖిల్ కూడా మోనాల్ తో ఇక కటీఫ్ అనుకున్నాడు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ కోసమే మోనాల్ తనకు సపోర్ట్ చేయలేదని తెగ ఫీలైన అఖిల్ మొత్తానికి ఈ నామినేషన్స్ లో అతన్ని పెట్టేసి షాక్ ఇచ్చాడు.

అఖిల్, మోనాల్ ఇప్పుడు ఆటలో వేరు వేరు దారులు చూసుకున్నారు. ఎవరికి వారు తమ ఆటని ఆడాలని చూస్తున్నారు. ముఖ్యంగా మోనాల్ లాస్ట్ వీక్ నుండి సోలో గేం ఆడాలని ఫిక్సయ్యింది. మరి మోనాల్ లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు కాని మోనాల్ సపొర్ట్ చేస్తుందని ఆశపడ్డ అఖిల్ నామినేషన్స్ లో ఉన్నాడు. ఫైనల్ గా 12వ వారం మోనాల్, అవినాష్, అరియానా, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు. అఖిల్ టాప్ 5లో పక్కా ఉంటాడని అనుకుంటున్నా వారలు గడుస్తున్నా కొద్దీ లెక్కలు మారే అవకాశం ఉంది. తప్పకుండా ఈసారి అఖిల్ టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు..                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: