మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన జోడీ కడుతుంది. సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అలరించగా ఈమధ్యనే రిలీజైన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమా కాన్సెప్ట్ యూత్ కు బాగా ఎక్కేస్తుందని తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చిత్రయూనిట్ బాలంగా నమ్ముతున్నారు.

ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. దాదాపు థియేటర్ రిలీజ్ కన్ ఫాం అయినట్టే. అయితే 9 నెలల తర్వాత థియేటర్ లో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి. థియేటర్లలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే ముందు తన లక్ టెస్ట్ చేసుకునేందుకు డేర్ స్టెప్ వేస్తున్నాడు సాయి ధరం తేజ్. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. జీ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ మాత్రం జీ 5 సొంతం చేసుకుంది.                                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: