మెగా ఇంట
పెళ్లి బాజాలు మరి కొన్ని రోజుల్లో మోగనున్నాయి. ఈ పెళ్లికి సంబందించిన పనులన్నీ శర వేగంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే
నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల
పెళ్లి ఈ నెల 9 న వైభవంగా జరగబోతోంది. డిస్టినేషన్ వెడ్డింగ్ ప్రకారం ఈ
పెళ్లి జరగనుందని నాగబాబు ఇదివరకే తెలియజేశారు.
నిహారిక, చైతన్యల పెళ్లిని
రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయని మెగా ఫ్యామిలీ తెలిపింది.
అయితే మెగా ఫ్యామిలీ తాజాగా నిహారికా
పెళ్లి కార్డును విడుదల చేసింది.
రాజస్థాన్ లో ఈ నెల 9
నిహారిక,
చైతన్య ల వివాహం జరగనుంది. అలాగే డిసెంబర్ 11న
హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ లో రిసెప్షన్ చేయనున్నారు. కాగా ఈ
పెళ్లి కార్డు చూసిన నెటిజన్లు అదరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లికూతురు కాబోతున్న
నిహారిక తన
పెళ్లి గురించి ఎగ్జైట్ మెంట్ అవుతుందనే చెప్పుకోవచ్చు.
ఇంకా ఏడురోజులే ఉందంటూ తాజాగా ఒక ఫోటోను ఇన్ స్టాగ్రామ్ తో పంచుకుంది. అదికాస్త సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. అలాగే
పెళ్లి ట్రీట్ గా తన ఫ్రెడ్స్ తో పార్టీలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మడు. ఈ మధ్యన లావణ్య త్రిపాఠితో కూడా
పార్టీ చేసుకుందట ఈ బ్యూటీక్వీన్. కాగా
నిహారిక తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాతో షేర్ చేసుకోవడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.
అయితే
నిహారిక పెళ్లిలో సందడి చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెగా బ్రదర్స్ అంతా తమ తమ షూటింగ్ కు చాలా రోజుల ముందే బ్రేక్ వేసారు. అలాగే
రామ్ చరణ్ కూడా ఈ మధ్యన షూటింగ్ నుంచి సెలవులు కోరినట్టు వార్తలు వినిపించాయి. ఇంకేముంది
నిహారిక పెళ్లితో మెగా ఫ్యామిలీ అంతా కలిసి
నిహారిక పెళ్లిని కనులవిందుగా చేయబోతున్నారని అర్థమవుతోంది.