దాంతో బోయపాటి శ్రీను మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే..దీంతో BB3 హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు.. ఈ చిత్రం నుంచి ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే బాలకృష్ణ క్రేజ్ కి తగిన టైటిల్ ను నిర్ణయించనున్నట్టు ఇటీవల బోయపాటి చెప్పాడు. 'మోనార్క్' అనే టైటిల్ ను ఖాయం చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. దీన్ని న్యూ ఇయర్ కి అనౌన్స్ చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారట. వరుసగా రెండు భారీ ఫ్లాప్ లు ఇచ్చిన బోయపాటి కొత్త ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. మరి బాలకృష్ణ తో బోయపాటి ఏ రేంజ్ హిట్ కొడతాడా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి