ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబో సినిమా రాలేదు. అయితే ఇద్దరు కలిసి మరో సినిమాకు సిద్ధమయ్యారు. ఈసారి ఎంటర్టైమెంట్ తో పాటుగా మెసేజ్ కూడా ఇస్తానని హరీష్ శంకర్ అన్నాడు. అయితే హరీష్ శంకర్, పవన్ కాంబో సినిమా 2022 చివర్లో లేదా 2023లో వస్తుందని టాక్. ప్రస్తుతం పవర్ స్టార్ వరుస సినిమాలు కమిట్ అవుతూ వస్తున్నాడు.
వకీల్ సాబ్ సినిమా కాగానే క్రిష్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. అది పూర్తి చేశాక అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమా షూటింగ్ ఉంటుందట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా షురూ చేస్తారట. సో ఎలా లేదన్నా వచ్చే ఏడాది చివర దాకా ఈ సినిమాలే సరిపోతాయి. అయితే అలా చూస్తే మాత్రం 2022 లోనే హరీష్ శంకర్ సినిమా ఉంటుందని టాక్. సో హరీష్ శంకర్, పవర్ స్టార్ సినిమా కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి