దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే దగ్గుబాటి వారసుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా రానా తన పాపులారిటీ నేషనల్ వైడ్ తెచ్చుకున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవా పాత్రలో రానాని తప్ప మరెవరిని ఊహించలేం అంటే అతని స్టామినా ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇక రానా రైట్ ట్రాక్ లోకి రాగా అతని తమ్ముడు అభిరామ్ ని కూడా హీరోగా నిలబెట్టాలని చూస్తున్నారు.

అసలైతే సురేష్ బాబు అభిరామ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకోగా అప్పట్లో శ్రీ రెడ్డి చేసిన రచ్చకు అభిరామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అభిరామ్ ను హీరోగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాను పెళ్లిచూపులు ఫేం తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు.

ఇక అభిరాం ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ బాధ్యతని తరుణ్ మీద పెట్టారత సురేష్ బాబు. రానా కూడా అభిరామ్ ఎంట్రీకి తరుణ్ అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. ఆల్రెడీ తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. అందుకే తరుణ్ భాస్కర్ తో అభిరామ్ సినిమా ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం అభిరామ్ పర్ఫెక్ట్ డెబ్యూ ఫిక అయినట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: