గోవా బ్యూటీ ఇలియానాకి మెగాస్టార్ చిరంజీవి లక్కెగా మారుతున్నాడని తెలుస్తుంది. తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిన ఇలియానా మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫాం లో ఉన్న ఇలియానా బాలీవుడ్ లో ఒక ఛాన్స్ రాగానే అక్కడకి జంప్ అయ్యింది. అయితే తెలుగులో మంచి ఛాన్సులు వచ్చినా కూడా రిజెక్ట్ చేసిన అమ్మడు బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో కూడా వెనకపడ్డది.

రష్యన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం నడిపించిన అమ్మడు అతనితో విడిపోయి ఇప్పుడు సోలోగా ఉంటుంది. తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఛాన్స్ వచ్చినా పెద్దగా యూజ్ కాలేదు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో అమ్మడికి ఛాన్స్ వచ్చినట్టు టాక్. లూసిఫర్ రీమేక్ గా కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇలియానాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ సినిమాలో ఇలియానా నిజంగానే అమ్మడికి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి అమ్మడు తన రీ ఎంట్రీలో అద్భుతమైన ఛాన్స్ అందుకోగా అది ఆమెకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇదేకాకుండా నాగార్జున బాలీవుడ్ రీమేక్ రైడ్ లో కూడా ఇల్లి బేబ్ ను హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తుంది. అదే జరిగితే తెలుగులో మళ్లీ ఇలియానా వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. గోవా బ్యూటీ నడుము అందాలతో ఆడియెన్స్ ను వల్లో వేసుకోగా మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: