తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కానుందట. మహేష్ కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు ఇప్పటికే అమెరికాలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టేవాడు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.. ఈ సినిమా లో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. బాలీవుడ్ నటుడిని విలన్ గా ఎంపిక చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.
సర్కారు వారి పాటలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లని మెప్పిస్తూ ఓ ఫైట్ సీన్ ఒకటి ఉందట. దివ్యాంగుల నేపథ్యంలో ఓ ఫైట్ ఈ సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. ఓ దివ్యాంగుడి కోసం కథానాయకుడు చేసే పోరాటం.. `నెవర్ బిఫోర్`లా ఉండబోతోందని తెలుస్తోంది. బహుశా.. ఈ చిత్రానికి ఇంట్రవెల్ ముందొచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇదే కావొచ్చు. ఈ సీన్ చెబుతున్నప్పుడు మహేష్ బాబు చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఇదే తరహా ఫైట్ సుప్రీమ్ లో చూశాం.. ఇందులో ఎలాంటి వెరైటీ చూపుతాడా చూద్దాం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి