మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. టికెట్ వెల పాతిక రూపాయలు ఉన్న టైం లోనే కోట్ల రూపాయలు కలక్షన్స్ వసూళు చేసి బాక్సాఫీస్ బాధ్షాగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు సినిమా అంటే ఆడియో రైట్స్ రేటు దగ్గర నుండి వసూళ్ల భీభత్సం వరకు అన్ని రికార్డులే. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పటికి అదే జోష్ కనబరుస్తున్నాడు.

ఖైదీ నంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు ఆ సినిమా తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసిం హా రెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుకి అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్న ఆచార్య సినిమా ఆడియో 4 కోట్ల రూపాయల భారీ రేటుకి కొనేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా మరోసారి మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో చూపిస్తుందని చెప్పొచ్చు. సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. మ్యూజిక్ రైట్స్ రేటు అదిరిపోగా ఆచార్య డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ లో కూడా దూఉకుడు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా మెగాస్టార్ కెరియర్ లో ఆచార్య స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: