ప్రస్తుతం సోనూ సూద్ కు సంబంధించి ఏ వార్త వచ్చిన అది క్షణాలలో వైరల్ గా మారుతోంది. కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కార్మికులు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సోనూ సూద్ ఇప్పుడు హీరోలకే సూపర్ హీరోగా మారుతున్నాడు.  


తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి అన్నార్తులకు సహాయం అందించిన సోనూ సూద్ ను రియల్ హీరోగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో సోనూ సూద్ మరోసారి వార్తలలోకి వచ్చాడు. ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఈ విలక్షణ నటుడుడు ఆ మూవీ యూనిట్ లోని వంద మంది సినీ కార్మికులకు సాయం అందించాడు.



మూవీ షూటింగ్ బ్రేక్ లో తన యూనిట్ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆమూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సుమారు వంద మంది కార్మికులు కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులలో ఉండటమే కాకుండా తమ పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం వారికి స్మార్ట్ ఫోన్స్ కొనిపెట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవడమే కాదు తెలుసుకున్న వెంటనే తన సొంత డబ్బుతో 100 స్మార్ట్ ఫోన్స్ తెప్పించి ‘ఆచార్య’ షూటింగ్ స్పాట్ లో యూనిట్ లోని కార్మికులందరికీ ఇవ్వడంతో షూటింగ్ స్పాట్ లో అంతా ఆశ్చర్యపడినట్లు టాక్.


ఈ విషయాలు చిరంజీవి దృష్టి వరకు వెళ్ళడంతో మెగా స్టార్ కూడ సోనూ సూద్ ను ప్రశంసించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోనూ సూద్ కు ఉన్న ఇమేజ్ తెలుసు కాబట్టే చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నెగిటివ్ పాత్రను పోషిస్తున్న సోనూ సూద్ ను కాలితో తన్నె సీన్ లో తాను నటించనని చెప్పి సోనూ సూద్ పై తన గౌరవాన్ని చాటుకున్నాడు. విలన్ గా నటించడానికి 4 కోట్లు డిమాండ్ చేస్తున్న సోనూ సూద్ విలన్స్ మధ్య రియల్ హీరోగా రోజురోజుకు ఎదిగిపోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: