అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కు రెడీ అవగా.. నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అఖిల్ ఈ సినిమాతో ఈసారి పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

నాగ చైతన్య కూడా మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ కొట్టి సూపర్ ఫాం లో ఉన్నాడు. చైతు, అఖిల్ ఇద్దరు ఫిబ్రవరి 12న తమ సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్ ఒక సినిమా ఇంప్యాక్ట్ మరో సినిమా మీద తప్పకుండా పడుతుంది. అందుకే నాగార్జున ఈ రెండు సినిమాల రిలీజ్ కు కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూస్తున్నాడట.

అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇక చైతు సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ రెండు సినిమాలతో వారిద్దరు పోటీ రసవత్తరంగా మారనుంది.  నాగార్జున మాత్రం తను హీరోగా చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమాని కూడా ఈ నెల చివరన రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: